ఆంధ్రప్రదేశ్ టీడీపీలో విషాదం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, నవ్యాంధ్ర తొలి కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనాతో కన్నుమూశారు (Chalamalasetty Ramanjaneyulu Dies With CoronaVirus). గత కొన్ని రోజుల కిందట కరోనా లక్షణాలతో విజయవాడ ప్రభుత్వ ఆసుతపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి రామాంజనేయులకు చికిత్స అందిస్తున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది. Telangana: కొత్తగా 2,426 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి (శుక్రవారం) ఉదయం ఆరోగ్యం మరింత విషమించడంతో రామాంజనేయులు తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మృతిపట్ల ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామాంజనేయులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు సంతాపం తెలిపారు. Sravani Suicide Case: లొంగిపోయిన దేవరాజ్..  


ఫొటో గ్యాలరీస్:



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR